శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 12:07:34

ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ఇప్పుడు అవ‌కాశాలు అపారం: ప‌్ర‌ధాని మోదీ

ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ఇప్పుడు అవ‌కాశాలు అపారం: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు దెబ్బ‌తిన్నాయ‌ని, ఇప్పుడిప్పుడే ఆ ప్ర‌భావం నుంచి క్ర‌మంగా కోలుకుంటున్నాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. ఈ ఉద‌యం పండిట్ దీన్‌ద‌యాల్ పెట్రోలియం యూనివ‌ర్సిటీలో 45 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యంగ‌ల మోనోక్రిస్ట‌లైన్ సోలార్ ఫొటో వోల్టాయిక్ పానెల్ ప్లాంటును వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని ప్రారంభించారు. 

అనంత‌రం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలోనే పెట్రోలియం యూనివ‌ర్సిటీ స్నాత‌కోత్స‌వంలో పాల్గొన్న ప్ర‌ధాని.. అక్క‌డి విద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. మీరంతా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఒకేసారి ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెడుతున్నారు. అయినా ఇప్పుడు ప్ర‌పంచ ఇంధ‌న రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధికి, ఉద్యోగాల క‌ల్ప‌న‌కు అపార‌మైన అవ‌కాశాలు ఉన్నాయి అని ప్ర‌ధాని పేర్కొన్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.