మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 13:30:51

27 శాతం పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

27 శాతం పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

హైదరాబాద్ : పట్టణాల్లో ఉద్యోగాయాలు చేసే యువత కరోనా ఎఫెక్ట్ తో  పల్లెబాట పట్టారు. ఊళ్ళల్లో ఉపాధి పొందేందుకు ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకుంటున్నారు. అందులోభాగంగా వ్యవసాయం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకోసం ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో ఈ కరోనా కష్ట కాలం‌లో  దిగ్గజ ట్రాక్టర్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ 27 శాతం పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాలు 27 శాతం పెరిగి 25,402 వాహనాలుగా నమోదయ్యాయి. 2019 జూలైలో 19,992గా ఉండగా మహీంద్రా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల కంటే ఎక్కువగా ట్రాక్టర్లను విక్రయించింది. వరుసగా మూడో నెల ట్రాక్టర్ సేల్స్ జోరుమీద ఉన్నాయి. అయితే మహీంద్రా ఆటో డివిజన్.. పాసింజర్, కమర్షియల్ వెహికిల్ సేల్స్ మాత్రం పడిపోయాయి. మహీంద్రా 2020 జూలైలో 25,678 ట్రక్స్, బస్సులు, ఎస్‌యూవీలు విక్రయించింది. కానీ ట్రాక్టర్ సేల్స్‌లో ఈ కంపెనీ గతంలో కంటే చెప్పుకోదగిన వృద్ధిని నమోదు చేసింది.


logo