అమెరికా అల్లర్లు.. మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం
హైదరాబాద్: అమెరికాలో ఆందోళనకారులు.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వాషింగ్టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని నల్లజాతీయులు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనకారులు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఓ వార్త సంస్థ పేర్కొన్నది. గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనపై వాషింగ్టన్ పార్క్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మిన్నియాపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడిని పోలీసులు హతమార్చడంతో.. అమెరికా అంతటా ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఆ ప్రదర్శనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి. అయితే వాషింగ్టన్‌లోని భారతీయ దౌత్యకార్యాలయంలో.. గాంధీ విగ్రహం ధ్వంసం కావడం కూడా ఆందోళనకారులు పనే అని తేలింది.
ఆందోళనకారులు హింసాత్మక బాట పట్టడంతో.. వారిని ట్రంప్ తనదైన స్టయిల్‌లో హెచ్చరించారు. ప్రదర్శనలను శాంతియుతంగా చేయకుంటే.. ఆర్మీని రంగంలోకి దింపనున్నట్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నల్లజాతీయుడిని చంపిన పోలీసు ఆఫీసర్ డెరిక్ చౌవిన్‌తో పాటు ఇతర పోలీసులపైనా కేసులు నమోదు అయ్యాయి.
వాషింగ్టన్ డీసీలో గాంధీ విగ్రహం ధ్వంసమైన ఘటన పట్ల అమెరికా క్షమాపణలు చెప్పింది. తమ క్షమాపణలను అంగీకరించాలంటూ అమెరికా అంబాసిడర్ కెన్ జస్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయు జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాని, గాంధీ విగ్రహ ధ్వంసాన్ని కూడా ఖండిస్తున్నట్లు కెన్ జస్టర్ పేర్కొన్నారు. ఎటువంటి వివక్షనైనా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు.
So sorry to see the desecration of the Gandhi statue in Wash, DC. Please accept our sincere apologies. Appalled as well by the horrific death of George Floyd & the awful violence & vandalism. We stand against prejudice & discrimination of any type. We will recover & be better.
— Ken Juster (@USAmbIndia) June 4, 2020
తాజావార్తలు
- ౩ నెలలుగా ముంబైలోనే పూరీ
- హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 బైక్ లాంచ్
- చైనా మరో ఎత్తుగడ.. భారత కంపెనీల్లో వాటాల హస్తగతానికి కుట్ర
- అరుణాచల్‌లో రెండో కరోనా మరణం
- వందల డ్రోన్లతో ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు : వీడియో వైరల్
- రష్యాలో 24గంటల్లో 6,368 కరోనా కేసులు
- భూ అయస్కాంత క్షేత్రంలో భారీ మార్పు!
- ట్రాన్స్ జెండర్ కు కరోనా.. ఆస్పత్రిలో ప్రత్యేక బెడ్లు
- బెంగళూర్‌లో పోలీసులపై కరోనా పంజా
- రజినీకాంత్ ఆంథెమ్ ను హిట్ చేసినందుకు ధన్యవాదాలు



