మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 11:57:00

సైబర్‌ నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం: మహారాష్ట్ర

సైబర్‌ నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం: మహారాష్ట్ర

ముంబై: సోషల్‌ మీడియాలో అభ్యంతరకరమైన, బూటకపు ప్ర.చారం చేసే సైబర్‌ నేరగాళ్లపట్ల కఠినంగా వ్యవహరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో సైబర్‌ నేరాలు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ శనివారం ఉదయం ఒక ప్రకటన చేశారు. 

‘లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మహారాష్ట్రలో సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ లాంటి సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా కొంతమంది బూటకపు ప్రచారం చేస్తున్నారు. సమాజంలో అల్లర్లు సృష్టించేలా, మహిళపై నేరాలను ప్రేరేపించేలా వీడియోలు, మెసేజ్‌లు పోస్ట్‌ చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు ఏ మాత్రం ఆమోదించదగ్గవి కావు. అందుకే అలాంటి తప్పుడు ప్రచారం చేసే సైబర్‌ నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ ప్రకటించారు.


logo