బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 16:19:10

పాలు, కూరగాయలు తెచ్చేవాళ్లతో కరోనా వచ్చిందేమో: మహారాష్ట్ర హోంమంత్రి

పాలు, కూరగాయలు తెచ్చేవాళ్లతో కరోనా వచ్చిందేమో: మహారాష్ట్ర హోంమంత్రి

ముంబై: పాలు, కూరగాయలు తెచ్చేవాళ్లతో కరోనా వ్యాపించిందేమోనని మహారాష్ట్ర హోంమత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలోని ఎనిమిది జైళ్లలో సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. జైళ్ల సిబ్బందిలో ఎవరినీ బయటకు వెళ్లనీయడం లేదు. బయటి నుంచి ఎవరినీ జైళ్లలోపలికి రానీయడం లేదు. అయినా కరోనా కేసులు నమోదవుతున్నాయంటే జైళ్లకు పాలు, కూరగాయలు తదితర సామాగ్రిని సరఫరా చేసే వారితో వైరస్‌ వ్యాపించిందేమో!’ అని అనిల్‌ దేశ్‌ముఖ్‌ అన్నారు. మహారాష్ట్రలో 77 మంది ఖైదీలకు, 26 మంది పోలీసులకు కరోనా సోకిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించడంతో మంత్రి ఈ విధంగా సమాధానం చెప్పారు.


logo