ఆదివారం 31 మే 2020
National - May 08, 2020 , 15:16:06

మహారాష్ట్రలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు

మహారాష్ట్రలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు

ముంబై: లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులను ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సామంత్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ యూనివర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీలకు తమ ఉత్తర్వులు వర్తిస్తాయని ఆయన తెలిపారు. అయితే, అన్ని కోర్సుల ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు మాత్రం పరీక్షలు రాయాల్సిందేనని మంత్రి సామంత్‌ స్పష్టంచేశారు. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు జూలైలో పరీక్షలు నిర్వహిస్తామన్న మంత్రి.. దానికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. 


logo