మంగళవారం 07 జూలై 2020
National - Jun 04, 2020 , 19:45:31

ముంబైలో అంతర్గత కదలికలకు అనుమతి

ముంబైలో అంతర్గత కదలికలకు అనుమతి

ముంబై: కరోనా విజృంభణతో అల్లాడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం(ఎంఎంఆర్‌)లో అంతర్గత కదలికలకు అనుమతి ఇచ్చింది. అయితే అంతర జిల్లా, రాష్ట్రాల  కదలికలపై నియంత్రణ కొనసాగుతుందని తెలిపింది. అయితే లాక్‌డౌన్‌ వల్ల చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకుల కదలికలు సంబంధిత విధివిధానాల మేరకు ఉంటాయని పేర్కొంది. కాగా, శుక్రవారం నుంచి రాష్ట్రంలో రెండో దశ సడలింపులు అమలులోకి రానున్నాయి. రోడ్డుకు ఒక వైపు షాపులు ఒక రోజు, మరో వైపు షాపులు మరుసటి రోజు చొప్పున అన్ని షాపులు తెరిచేందుకు అనుమతిస్తారు. జూన్‌ 7 నుంచి ఇండ్లకు దిన పత్రికల సరఫరాను పునరుద్ధరిస్తారు. పరీక్షల జవాబు పత్రాలు దిద్దడం, ఈ పాంఠ్యాంశాలను రూపొందించడం వంటి వాటి కోసం పరిమిత స్థాయిలో విద్యా సంస్థల కార్యాలయాలు పనిచేయవచ్చు. జూన్‌ 8 నుంచి మూడో దశ సడలింపుల అమలులో భాగంగా పది శాతం సిబ్బందితో ప్రైవేట్‌ కార్యాలయాలు తెరుచుకుంటాయి. ఈ మేరకు మార్గదర్శకాలను మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం జారీ చేసింది. 


logo