ఆదివారం 05 జూలై 2020
National - Jun 23, 2020 , 17:54:19

ప‌రీక్ష‌ల సంఖ్య‌ పెంచ‌క‌పోతే ప్ర‌మాద‌క‌రం: ఫ‌డ్న‌వీస్‌

ప‌రీక్ష‌ల సంఖ్య‌ పెంచ‌క‌పోతే ప్ర‌మాద‌క‌రం: ఫ‌డ్న‌వీస్‌

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వ చేత‌గాని త‌నంవ‌ల్లే కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్న‌ద‌ని ప్ర‌తిప‌క్ష బీజేపీ ఆరోపిస్తున్న‌ది. కేసులు వేగంగా పెరుగుతున్నా అందుకు త‌గ్గ‌ట్టుగా ప‌రీక్ష‌ల సంఖ్య పెరుగ‌డం లేద‌ని బీజేపీ నేత‌, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ విమ‌ర్శించారు.

రాష్ట్రంలో అందుబాటులో ల్యాబ్‌ల‌లో రోజుకు 38,000 ప‌రీక్ష‌లు చేసే సామ‌ర్థ్యం ఉన్న‌ద‌ని, శివ‌సేన నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారు మాత్రం రోజుకు కేవ‌లం 14,000 మందికే ప‌రీక్ష‌లు చేయిస్తున్న‌ద‌ని ఫ‌డ్నవీస్ ఆరోపించారు. కేసులు పెరుగుతున్న వేళ టెస్టుల సంఖ్య త‌గ్గించ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌న్నారు. ప్ర‌స్తుతం కంటైన్మెంట్ జోన్ల వెలుప‌ల మాత్ర‌మే కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో టెస్టుల‌ సంఖ్య పెంచ‌డ‌మే స‌రైన ప‌రిష్కార‌మ‌ని ఫ‌డ్న‌వీస్ సూచించారు.     


logo