శనివారం 11 జూలై 2020
National - Jun 23, 2020 , 19:00:38

ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రిస్తే చైనా దారికొస్తుంది: అజిత్ ప‌వార్‌

ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రిస్తే చైనా దారికొస్తుంది: అజిత్ ప‌వార్‌

ముంబై: చైనాలో తయార‌య్యే ఉత్ప‌త్తుల‌ను మ‌న దేశంలో బ‌హిష్క‌రిస్తే డ్రాగ‌న్ కంట్రీ త‌ప్ప‌కుండా దారిలోకి వస్తుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేర్కొన్నారు. మూడు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుసటిరోజే పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గల్వాన్ లోయలో చైనా బలగాలు దురాక్రమణకు దిగి 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకోవడంపై దేశవ్యాప్తంగా డ్రాగన్ దేశంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో అజిత్ పవార్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడుతూ మన విషయంలో తప్పుగా నడుచుకుంటున్న దేశంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంద‌న్నారు.  భారతీయులు చైనా ఉత్పత్తులను ఉపయోగించడం మానేయాలని సూచించారు. 125 కోట్ల మంది భారతీయులు డ్రాగ‌న్ ఉత్ప‌త్తుల‌ను వాడ‌టం మానేస్తే చైనా దానంతట అదే దారికొస్తుంద‌ని పవార్ పేర్కొన్నారు.


logo