మంగళవారం 02 మార్చి 2021
National - Jan 16, 2021 , 23:27:10

18న మ‌హారాష్ట్ర‌లో టీకా నిలిపివేత‌?!

18న మ‌హారాష్ట్ర‌లో టీకా నిలిపివేత‌?!

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేయ‌డానికి శ‌నివారం దేశ‌వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రారంభించిన వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను 18వ తేదీ వ‌ర‌కు తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. క‌రోనా వ్యాక్సిన్ కోసం పేరు న‌మోదు చేసుకోవాల్సిన సాఫ్ట్‌వేర్ అప్లికేష‌న్.. కొవిన్ లో త‌లెత్తిన సాంకేతిక స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల్సి ఉంద‌ని మ‌హారాష్ట్ర అధికారులు శ‌నివారం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత ప్ర‌క‌టించారు.  

‌కొవిన్‌లో సాంకేతిక స‌మ‌స్య‌ల వ‌ల్ల కొన్ని కేంద్రాల్లో టీకాలు వేయ‌డం నెమ్మ‌దిస్తున్న‌ద‌ని మ‌హారాష్ట్ర అధికారులు తెలిపారు. తొలిరోజు ఇమ్యూనైజేష‌న్ కార్య‌క్ర‌మంలో మూడు వేల‌కు పైగా కేంద్రాల్లో మూడు ల‌క్ష‌ల మందికి పైగా వ్యాక్సినేష‌న్ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నా.. 1.91 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ ఇవ్వ‌గ‌లిగారు. 

వ్యాక్సినేష‌న్ త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌లేద‌ని, కొవిన్ వ‌ల్లే స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయ‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు అంటున్నారు. మ‌హారాష్ట్ర‌లో 285 కేంద్రాల్లో తొలి రోజు 28,500 మందికి టీకా వేయాల‌ని అధికారులు నిర్ణ‌యించినా, ఆచ‌ర‌ణ‌లో 18,425 మందికి మాత్ర‌మే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యింది. అంటే 65 శాతం మంది ఆరోగ్య కార్య‌కర్త‌లు మాత్ర‌మే టీకాలు వేయించుకున్నారు.

హింగోలి జిల్లాలో 100 శాతం, ధూలే, షోలాపూర్‌, బీడ్‌, ప‌ర్బానీ, బుల్ధానా జిల్లాల్లో 90 శాతానికి పైగా వ్యాక్సినేస‌న్ పూర్త‌యింద‌ని రాష్ట్ర ఇమ్యూనైజేష‌న్ అధికారి డాక్ట‌ర్ దిలీప్ పాటిల్ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo