బుధవారం 03 మార్చి 2021
National - Jan 22, 2021 , 14:39:54

విషవాయువు లీక్‌.. ఏడుగురికి అస్వస్థత

విషవాయువు లీక్‌.. ఏడుగురికి అస్వస్థత

ముంబై: ఒక ప్లాంట్‌ నుంచి లీకైన విషవాయువు వల్ల ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక పారిశ్రామికవాడలోని ఇండో ఎమైన్స్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకైంది. దీంతో ఈ విషవాయువు ప్రభావం వల్ల ఏడుగురు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఫ్లాంట్‌ వద్ద పోలీసులను మోహరించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్­లోడ్ చేసు­కోండి

VIDEOS

logo