బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 14:58:49

మహారాష్ట్రలో నెలాఖరు వరకు లాక్‌డౌన్‌!

మహారాష్ట్రలో నెలాఖరు వరకు లాక్‌డౌన్‌!

ముంబై: కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ముంబై, పుణె, మాలేగావ్‌, ఔరంగాబాద్‌, షోలాపూర్‌ వంటి కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌లలో లాక్‌డౌన్‌ను పొడిగించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది. దేశంలో నాలుగో విడత లాక్‌డౌన్‌ ఉంటుందని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే లాక్‌డౌన్‌ నిబంధనలను రాష్ట్రంలో అమలుచేస్తామని సీనియర్‌ మత్రి ఒకరు వెల్లడించారు. లాక్‌డౌన్‌ పొడిగింపును అధికారికంగా ప్రకటించాల్సి ఉందని చెప్పారు. 

కరోనా వ్యాప్తిని నిలువరించడానికి ప్రధాని మోదీ మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దేశంలో కరోనా కేసులు సంఖ్య తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న మూడోవిడత లాక్‌డౌన్‌ ఈ నెల 17న ముగుస్తుంది.


logo