గురువారం 09 జూలై 2020
National - Jun 25, 2020 , 18:27:38

ఆ రాష్ర్టంలో క‌టింగ్స్ కు ఓకే.. షేవింగ్స్ కు నో

ఆ రాష్ర్టంలో క‌టింగ్స్ కు ఓకే.. షేవింగ్స్ కు నో

ముంబై : అన్ని రాష్ర్టాలో సెలూన్స్ కు అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ.. క‌రోనా విజృంభ‌ణ దృష్ట్యా మ‌హారాష్ర్ట‌లో అనుమ‌తివ్వ‌లేదు. సుమారు 3 నెల‌ల త‌ర్వాత అక్క‌డ సెలూన్స్ తెరుచుకుంటున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి హెయిర్ సెలూన్స్ దుకాణాల ఓపెన్ కు అనుమ‌తిచ్చారు. క‌చ్చితంగా నిబంధ‌న‌లు పాటించాల‌ని ఆదేశించారు. అయితే కేవ‌లం హెయిర్ క‌టింగ్ కు మాత్ర‌మే అనుమ‌తిచ్చారు. షేవింగ్స్ కు అనుమ‌తివ్వ‌లేదు. దుకాణ య‌జ‌మాని, క‌స్ట‌మ‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. లేని యెడ‌ల చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌పై శుక్ర‌వారం తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. 

దేశంలోనే మ‌హారాష్ర్ట‌లో అత్య‌ధికంగా 1,42,899 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 6,739 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్య‌ధికంగా ముంబైలో 69,528, థానేలో 27,880, పుణెలో 17,445, పాల్గ‌ర్ లో 4,028, ఔరంగాబాద్ లో 3867 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.


logo