National
- Jan 25, 2021 , 21:28:10
VIDEOS
మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు

ముంబై: మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతిరోజు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు, 50కి పైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 1,842 కరోనా కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,10,948కు, మరణాల సంఖ్య 50,815కు చేరింది.
మరోవైపు గత 24 గంటల్లో 3,080 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,15,344కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 43,561 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- పెట్రోల్ పంపుల్లో మోదీ హోర్డింగ్‌లు తీసేయండి..
- రిషబ్ పంత్ స్లెడ్జింగ్.. తర్వాతి బంతికే క్రాలీ ఔట్.. వీడియో
- కోవిడ్ టీకా తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- మూతపడిన కరాచీ బేకరీ
- శ్రీవారిని దర్శించుకున్న అల్లరి నరేష్
- ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీ గొంతుకనవుతా: వాణీదేవి
- డీఎంకేతో పొసగని కాంగ్రెస్ పొత్తు.. కూటమిలో కొనసాగేనా?
- లంచ్ టైమ్.. ఇంగ్లండ్ 74/3
- హీరోని చూసేందుకు నీళ్ళల్లోకి దూకిన అభిమాని
- విరాట్ కోహ్లి vs బెన్ స్టోక్స్.. నాలుగో టెస్ట్‌లో గొడవ.. వీడియో
MOST READ
TRENDING