గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 21:55:32

మహారాష్ట్రలో నేడు 9,251 కొత్త కరోనా కేసులు

మహారాష్ట్రలో నేడు 9,251 కొత్త కరోనా కేసులు

ముంబై:  మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 9,251 కొత్త కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వల్ల 257 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3, 66,368కి చేరుకుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

రాష్ట్రంలో మొత్తం 1,45,481 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటివరకూ 2,07,194 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  ఇదిలావుండగా, ముంబైలో 1,090 కొవిడ్ -19 పాజిటివ్ కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి.  617 మంది డిశ్చార్జ్ అయ్యారని మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ ముంబై తెలిపింది. దీంతో నగరంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య ఇప్పుడు 1,07,981కు చేరుకుంది. ఇందులో 78,877 మంది రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 6,033 మంది మరణించారు. ముంబైలో అత్యంత కరోనా ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచి ధారావిలో నేడు 10 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo