శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 21, 2020 , 22:05:34

మహారాష్ట్రలో లక్షన్నరకుపైగా కరోనా యాక్టివ్‌ కేసులు

మహారాష్ట్రలో లక్షన్నరకుపైగా కరోనా యాక్టివ్‌ కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా ప్రతి రోజు పది వేల వరకు పాజిటివ్‌ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు కొత్తగా 8,142 పాజిటివ్‌ కేసులు, 180 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,17,658కు, మరణాల సంఖ్య 42,633కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 23,371 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 14,15,679కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,58,852 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది.

మరోవైపు ముంబైలో కొత్తగా 1,609 కరోనా కేసులు, 48 మరణాలు నమోదైనట్లు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది. దీంతో ముంబైలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,45,871కు మరణాల సంఖ్య 9,869కు చేరినట్లు తెలిపింది. ప్రస్తుతం ముంబైలో 19,245 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి