బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 20:22:17

కొత్తగా 7,539 కరోనా కేసులు.. 198 మరణాలు

కొత్తగా 7,539 కరోనా కేసులు.. 198 మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నది. ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 7,539 పాజిటివ్‌ కేసులు, 198 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,25,197కు, మరణాల సంఖ్య 42,831కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 16,177మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 14,31,856కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,50,011 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.