ఆదివారం 06 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 21:23:56

6,417 కరోనా కేసులు.. 137 మరణాలు

6,417 కరోనా కేసులు.. 137 మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా ప్రతిరోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 6,417 కరోనా కేసులు, 137 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,38,961కు, మరణాల సంఖ్య 43,152కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 10,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 14,55,107కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,40,194 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. 

మరోవైపు ముంబైలో కొత్తగా 1,257 కరోనా కేసులు, 50 మరణాలు నమోదైనట్లు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌(బీఎంసీ) వెల్లడించింది. దీంతో ముంబైలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,50,061కు మరణాల సంఖ్య 10,016కు చేరినట్లు తెలిపింది. ప్రస్తుతం ముంబైలో 19,554 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.