e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జాతీయం మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు.. 278 మరణాలు

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు.. 278 మరణాలు

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు.. 278 మరణాలు

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు, యాక్టివ్ ‌కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 58,952 కరోనా కేసులు, 278 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,78,160కు, మర­ణాల సంఖ్య 58,804కు చేరింది. అలాగే ముంబైలో బుధవారం రికార్డుస్థాయిలో 9,925 కరోనా కేసులు, 54 మరణాలు నమోదయ్యాయి.

మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 39,624 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 29,05,721కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,12,070 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు.. 278 మరణాలు

ట్రెండింగ్‌

Advertisement