శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 03, 2020 , 21:54:26

5,182 కరోనా కేసులు.. 115 మరణాలు

5,182 కరోనా కేసులు.. 115 మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్‌ కేసులు, వందకుపైగా  మరణాలు వెలుగు చూస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 5,182 పాజిటివ్‌ కేసులు, 115 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,37,358కు, మరణాల సంఖ్య 47,472కు పెరిగింది. 

మరోవైపు గత 24 గంటల్లో 8,066 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 17,03,274కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 85,535 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. logo