శుక్రవారం 03 జూలై 2020
National - Jun 29, 2020 , 21:36:12

మహారాష్ట్రలో నేడు 5,257 కరోనా పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో నేడు 5,257 కరోనా పాజిటివ్‌ కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. సోమవారం ఒక్కరోజే 5,257 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,69,883కు చేరుకుంది. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. కరోనాతో 181మంది మృత్యువాతపడ్డారు. 2,385 మంది డిశ్చార్జి అయ్యారు.

కాగా, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 88,960 మంది కరోనా బారినపడి కోలుకోగా, ప్రస్తుతం 73,298 యాక్టివ్‌ కేసులున్నాయి. అలాగే, బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో సోమవారం 17 కొత్త కేసులు నమోదుకాగా, ఒకరు చనిపోయారు. కరోనాను కట్టిడి చేసేందుకు ఆ రాష్ట్ర సర్కారు లాక్‌డౌన్‌ను జూలై 31 వరకు పొడిగించింది. logo