e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జాతీయం మహారాష్ట్రలో రికార్డుస్థాయిలో 47 వేలకుపైగా ‌కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డుస్థాయిలో 47 వేలకుపైగా ‌కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డుస్థాయిలో 47 వేలకుపైగా ‌కరోనా కేసులు

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 29 లక్షలు, యాక్టివ్ ‌కేసుల సంఖ్య 3.8 లక్షలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 47,827 కరోనా కేసులు, 202 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,04,076కు, మర­ణాల సంఖ్య 55,100కు చేరింది. అలాగే ముంబైలో శుక్రవారం రికార్డుస్థాయిలో 8,832 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 4,32,192కు పెరిగింది.

మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 24,126 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 24,57,494కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,89,832 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మహారాష్ట్రలో రికార్డుస్థాయిలో 47 వేలకుపైగా ‌కరోనా కేసులు

ట్రెండింగ్‌

Advertisement