శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 26, 2020 , 21:10:34

లక్షకుపైగా కరోనా యాక్టివ్‌ కేసులు

లక్షకుపైగా కరోనా యాక్టివ్‌ కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గింది. రెండు మూడు రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 3,645 పాజిటివ్‌ కేసులు, 84 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,48,665కు, మరణాల సంఖ్య 43,348కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 9,905 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 14,70,660కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,34,137 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.