National
- Jan 14, 2021 , 20:50:19
3,579 కరోనా కేసులు.. 70 మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,579 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,81,623కు, మరణాల సంఖ్య 50,291కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 3,309 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,77,588కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52,558 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- 36 గంటల్లో భేషరతు క్షమాపణః సువేందుకు అభిషేక్ సవాల్
- కబడ్డీ ఆటలో.. యువకుడు మృతి
- ట్రంప్ వీడ్కోలు.. నెటిజెన్ల వెక్కిరింతలు
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
- గంగా జలానికి తరలివెళ్లిన మెస్రం గిరిజనులు
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- సీరం ఇన్స్టిట్యూట్ అగ్నిప్రమాదంలో.. ఐదుగురు మృతి
- వర్క్ ఫ్రం హోం.. సైకిళ్లపై ముంబై టు కన్యాకుమారి
MOST READ
TRENDING