National
- Jan 01, 2021 , 20:22:45
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
3,524 కరోనా కేసులు.. 59 మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,524 కరోనా కేసులు, 59 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,35,636కు, మరణాల సంఖ్య 49,580కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 4,279 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,32,825కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52,084 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
తాజావార్తలు
MOST READ
TRENDING