మహారాష్ట్రలో భారీగా కొత్త కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. ప్రతిరోజు భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 17,794 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలు దాటి 13,00,757కు చేరింది. అందులో 9,92,806 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
శుక్రవారం ఒక్కరోజే 19,592 మంది కరోనా మహమ్మారి నుంచి రికవరీ అయ్యారు. మొత్తం కేసులలో రికవరీ అయినవారు పోగా మరో 2,72,775 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా మరణాలు కూడా మహారాష్ట్రలో భారీగానే నమోదవుతున్నాయి. శుక్రవారం కొత్తగా 416 మంది కరోనా బాధితులు మరణించడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 34,761కి చేరింది. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఇరగదీసిన అశ్విన్, అక్షర్.. నాలుగో టెస్ట్‌లో ఇండియా విక్టరీ
- గాలి సంపత్ కోసం రామ్, జాతి రత్నాల కోసం విజయ్..!
- బడ్జెట్ సమావేశాలపై సీఎం సమీక్ష
- ప్రగ్యా ఠాకూర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- కదులుతున్న బస్సులో మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు
- భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య
- లవర్‌తో హోటల్లో గడిపేందుకు బాలికను కిడ్నాప్ చేసిన మహిళ
- విడాకులు వద్దు.. నా భర్తే ముద్దంటున్న నవాజుద్ధీన్ భార్య
- ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 !
- తృణమూల్‌కు గుడ్‌బై చెప్పిన మరో నేత