సోమవారం 25 జనవరి 2021
National - Sep 21, 2020 , 21:21:52

మ‌హారాష్ట్ర‌లో 33 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

మ‌హారాష్ట్ర‌లో 33 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త కొన్నాళ్లుగా రోజూ 15 వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమ‌వారం రాత్రి వ‌ర‌కు కూడా కొత్త‌గా 15,738 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 12,24,380కి చేరింది. అయితే, గ‌త 24 గంట‌ల్లో న‌మోదైన కేసుల కంటే డిశ్చార్జి అయిన వారి సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ది. సోమ‌వారం 32,007 మంది డిశ్చార్జి కావ‌డంతో మొత్తం డిశ్చార్జిల సంఖ్య 9,16,348కి చేరింది. 

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా మ‌హారాష్ట్ర‌లో భారీగానే న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 344 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 33,015కు చేరింది. ఒక్క ముంబైలోనే పాజిటివ్ కేసుల సంఖ్య‌ 1,86,150కి చేరింది. అందులో ప్ర‌స్తుతం 26,735 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ముంబైలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా 8,502కు చేరింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo