గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 21:02:26

మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే 322 మంది మృతి

మ‌హారాష్ట్ర‌లో ఒక్క‌రోజే 322 మంది మృతి

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శ‌నివారం కూడా 9,601 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 4,31,719కి చేరింది. అందులో 2,66,883 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 1,49,214 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా మ‌హారాష్ట్ర‌లో భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. శ‌నివారం కూడా ఒక్క‌రోజే 322 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 15,316కు చేరింది. మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo