సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 20:26:20

మహారాష్ట్రలో కొత్తగా 9,509 కరోనా కేసులు..260 మరణాలు

మహారాష్ట్రలో  కొత్తగా 9,509 కరోనా కేసులు..260 మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.  రాష్ట్రంలో ఒక్కరోజే  కొత్తగా 9,509 మందికి కరోనా  పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆదివారం రికార్డు స్థాయిలో 260 మరణాలు సంభవించాయి.  రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,41,228కు చేరింది. ఇప్పటి వరకు 2,76,809 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,537 యాక్టివ్‌ కేసులున్నాయి.  ఒక్క పుణెలోనే  ప్రస్తుతం  44,204 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 15,576కు పెరిగింది. 


logo