మంగళవారం 19 జనవరి 2021
National - Dec 23, 2020 , 21:56:23

3,913 కరోనా కేసులు.. 93 మరణాలు

3,913 కరోనా కేసులు.. 93 మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వందలోపు మరణాలు వెలుగుచూస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 3,913 కరోనా కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,06,371కు మరణాల సంఖ్య 48,969కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 7,620 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,01,700కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 54,573 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.