శనివారం 15 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 22:47:48

మహారాష్ట్రలో కరోనా విలయం

మహారాష్ట్రలో కరోనా విలయం

ముంబై : మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ వేల సంఖ్యలో పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గడిచిన 24గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 9,601 కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 322 మంది మృతి చెందారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 4,31,719 కరోనా కేసులు నమోదుకాగా 2,66,883 మంది చికిత్సకు కోలుకొని దవాఖాల నుంచి డిశ్చార్జి అయ్యారు. 1,49,214 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 15,316 మంది మృతి చెందారు. రాష్ట్ర రాజధాని ముంబైలో 1,15,346 కేసులు నమోదుకాగా 6,395 మంది మృతి చెందారని బ్రిహాన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.  ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 16,95,988 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ తెలిపింది.logo