గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 10:55:43

మహారాష్ట్రలో 24 గంటల్లో 15 కరోనా కేసులు నమోదు

మహారాష్ట్రలో 24 గంటల్లో 15 కరోనా కేసులు నమోదు

ముంబయి : మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ముంబయిలో 14 కేసులు నమోదు కాగా, పుణెలో ఒక కేసు నమోదైంది. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 89కి చేరింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మార్చి 31వ తేదీ వరకు రైళ్లను రద్దు చేశారు. అత్యవసరం కానీ సేవలన్నింటిని బంద్‌ చేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్‌తో మహారాష్ట్రలో ఇద్దరు, కర్ణాటక, పంజాబ్‌, ఢిల్లీ, గుజరాత్‌, బీహార్‌లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందారు. 


logo