శనివారం 04 జూలై 2020
National - May 24, 2020 , 14:14:57

87 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

87 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

ముబై: కరోనా యోధులైన పోలీసులు అదే వైరస్‌ బారిన పడుతున్నారు. దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇంకా వెయ్యిలోపే ఉన్నాయి. కానీ మహారాష్ట్రలోని ఒక్క పోలీస్‌ శాఖలోనే ఇప్పటివరకు 1758 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో  ఒక్క రోజులోనే కొత్తగా 87 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇందులో ఒక పోలీసు అధికారితోపాటు 17 మంది వివిధ హోదాల్లో పనిస్తున్నవారు ఉన్నారు. కరోనా వైరస్‌తో ఇప్పటివరకు 18 మంది పోలీసులు మరణించారు. రాష్ట్రంలో 1067 మంది పోలీసులు హాస్పిటళ్లలో చికిత్స పొందుతుండగా, 673 మంది కోలుకున్నారు. మొత్తం 1758 మంది కరోనా పాజిటివ్‌లలో 183 మంది అధికారులు ఉండగా, 1575 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసులు ఉన్నారు.   

దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 47190 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. మొత్తం 1577 మంది మరణించారు.


logo