గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 10:34:53

మ‌హారాష్ట్ర పోలీస్‌లో 93కు చేరిన మ‌ర‌ణాలు

మ‌హారాష్ట్ర పోలీస్‌లో 93కు చేరిన మ‌ర‌ణాలు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తున్న‌ది. రోజూ వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌హారాష్ట్ర పోలీస్ డిపార్టుమెంట్‌లో సైతం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్న‌ది. ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో క‌రోనా బారిన‌ప‌డ్డ పోలీసుల సంఖ్య 8,483కు చేరింది. అందులో 6,471 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 1919 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసుల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 93 మంది మ‌ర‌ణించారు. మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.               

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo