మంగళవారం 07 జూలై 2020
National - Jun 22, 2020 , 15:03:43

55 మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా!

55 మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా!

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ప్రజాసేవలో ఉండే పోలీసులు మహమ్మారి బారిన పడుతున్నారు. గడిచిని 24 గంటల్లో 55 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్‌-19తో బాధపడుతున్న పోలీసుల సంఖ్య 4,103కు చేరింది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 48 మంది రక్షక భటులు చనిపోయారు. 

  ఇప్పటివరకూ మొత్తం 3,039 మంది పోలీసులు కోలుకోగా, 1,106 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మొదటిసారిగా మహారాష్ట్రలోని ముంబై సెవెన్‌హిల్స్‌ హాస్పిటల్‌లో జూన్‌ 21న కరోనాతో బాధపడుతూ స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన పోలీస్‌ చనిపోయాడు. logo