గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 15:33:50

మహారాష్ట్ర పోలీసులను వదలని కరోనా

మహారాష్ట్ర పోలీసులను వదలని కరోనా

ముంబై : మహారాష్ట్ర పోలీసులను కరోనా వదలడం లేదు. చాలామంది వైరస్‌ బారినపడి విలవిలాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 434 మంది కరోనా బారిపడగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా నలుగురు సిబ్బంది మృతి చెందారని ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసుశాఖలో ఇప్పటివరకు 20,801 మంది కోవిడ్‌-19 వైరస్‌ బారినపడగా 16,706 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 3,883 మంది దవాఖానలో చికిత్స పొందుతుండగా 212 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనాతో తీవ్రంగా ప్రభావిత రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు 10 లక్షల మందికిపైగా కరోనా బారినపడగా సుమారు 7 లక్షల మందికిపైగా కోలుకున్నారు. 3 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo