ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 09:39:40

శివ‌సేన‌లో చేరిన మంత్రి

శివ‌సేన‌లో చేరిన మంత్రి

ముంబై: మ‌హారాష్ట్ర మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే శంక‌ర్ రావు గ‌ద‌ఖ్ అధికారి శివ‌సేన పార్టీలో చేరారు. శంక‌ర్ రావును శివసేన అధిపతి, సీఎం ఉద్ధవ్ థాక్రే సాద‌రంగా ఆహ్వానించారు. సీఎం థాక్రే నివాస‌మైన మాతోశ్రీలో పార్టీలో చేరిక సంద‌ర్భంగా ఆయ‌న‌కు శివ బంధన్‌ను క‌ట్టారు.

అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లాలోని నెవా‌సా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా శంక‌ర్ రావు విజ‌యం సాధించారు. అనంత‌రం శివ‌సేన నేతృత్వంలోని మ‌హావికాస్ అఘాడీ సంకీర్ణ ప్ర‌భుత్వంలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ భూమి, జ‌ల‌శాఖ మంత్రిగా ప‌నిచేస్తున్నారు.


logo