రేప్ చేయలేదు.. ఆమెతో రిలేషన్లో ఉన్నా : మంత్రి ధనంజయ్

ముంబై : తనపై వచ్చిన రేప్ ఆరోపణలను మహారాష్ట్రకు చెందిన సామాజిక, న్యాయశాఖ మంత్రి ధనంజయ్ ముండే కొట్టిపారేశారు. తన ఫేస్బుక్లో ఓ పోస్టు చేసిన మంత్రి ధనంజయ్.. తనపై ఫిర్యాదు చేసిన 38 ఏళ్ల మహిళతో 2008 నుంచి రిలేషన్లో ఉన్నట్లు తెలిపారు. ఆమెను రేప్ చేయలేదని ఆయన అన్నారు. అయితే ఆమెతో పాటు ఆమె సోదరి తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. గత ఏడాది నవంబర్‌లో తాను కూడా పోలీసు ఫిర్యాదు ఇచ్చినట్లు మంత్రి తన పోస్టులో పేర్కొన్నారు. 2008 నుంచి ఆ మహిళతో రిలేషన్లో ఉన్నానని, తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు మంత్రి తెలిపారు. తమ కుటుంబసభ్యులు కూడా ఆ రిలేషన్‌ను అంగీకరించినట్లు మంత్రి చెప్పారు. ఎన్సీపీ నేత అయిన ధనంజయ్.. రిలేషన్ ఉన్నట్లు అంగీకరించగానే.. బీజేపీ మహిళా విభాగం ఆ నేతకు వ్యతిరేకంగా సీఎం ఉద్దవ్‌కు ఫిర్యాదు చేసింది.