శుక్రవారం 03 జూలై 2020
National - Jun 28, 2020 , 20:02:08

మహారాష్ట్రలో ప్లాస్మా కేంద్రం : సీఎం ఉద్దవ్‌ ఠాక్రే

మహారాష్ట్రలో ప్లాస్మా కేంద్రం : సీఎం ఉద్దవ్‌ ఠాక్రే

ముంబై : ప్లాస్మా థెరపీ కేంద్రాన్ని సోమవారం ప్రారంభిస్తున్నామని, దీంతో ప్లాస్మా థెరపీ నిర్వహించే అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర అవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అన్నారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్లాస్మా దానం చేయాలని, దీని ద్వారా 90శాతం బాధితులు కోలుకుంటున్నారని తెలిపారు. 'రేపు జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తామని, వారు మా కోసం పోరాడుతున్నారు.. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌తో పాటు కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా వ్యవసాయ రుణాల మాఫీ ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. ప్రస్తుతం మిగతా రైతుల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో ఎన్నో ఉత్సవాలు గడిచాయని, అన్ని మతాల ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారంటూ వారికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జరుగబోయే ఆషాదీ వరి కార్యక్రమానికి హాజరవుతున్నానని, ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని విఠళేశ్వరున్ని వేడుకోనున్నట్లు తెలిపారు. ఈ యేడాది దహీ హండీ గురించి ఎవరూ మాట్లాడకుండా రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సారి సామాజిక విధి నిర్వహణలో భాగంగా గణపతి విగ్రహాలను నాలుగు అడుగులు మాత్రమే ఉండేలా చూడాలని, మండపాల వద్ద సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలని ఉత్సవ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.  


logo