ఆదివారం 24 మే 2020
National - Mar 21, 2020 , 13:39:02

ఏసీల వినియోగాన్ని తగ్గించండి.. మ‌హారాష్ట్ర ఆదేశాలు

ఏసీల వినియోగాన్ని తగ్గించండి.. మ‌హారాష్ట్ర ఆదేశాలు

హైద‌రాబాద్‌: క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో.. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది.  ఏసీల వినియోగాన్ని త‌గ్గించుకోవాలంటూ ఇవాళ సూచించింది.  కోవిడ్‌19 నేప‌థ్యంలో ఈ ఆదేశాలు జారీ చేస్తున్న‌ట్లు మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి రాజేశ్ తోప్ తెలిపారు.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఏసీల వినియోగాన్ని త‌గ్గించాలంటూ త‌మ సూచ‌న‌ల్లో పేర్కొన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  ఏసీ డ‌క్ట్స్‌, వెంట్స్ నుంచి వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ఎయిర్ కండీష‌న్డ్ రూముల్లో వైర‌స్ ఎక్కువ స‌మ‌యం స‌జీవంగా ఉండే అవ‌కాశాలు ఉన్నాయి.  అందుకే గ‌వ‌ర్న‌మెంట్‌, ప్రైవేటు ఆఫీసుల్లో ఏసీల వినియోగాన్ని ప‌రిమితం చేయాల‌ని ప్ర‌భుత్వం త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది.  ఏసీల‌కు బ‌దులుగా ఫ్యాన్ల‌ను ఎక్కువ వాడ‌డం బెట‌ర్‌. గాలిలో ఉన్న‌ వైర‌స్ త్వ‌ర‌గా సెటిల్ కావాలంటే, ఆ గాలి ఎక్కువ డిస్టర్బ్ కావాల్సి ఉంటుంది.  అయితే ఏసీ వ‌ల్ల గాలి క‌ద‌లిక అంత‌గా ఉండ‌దు. అందుకే ఎక్కువ‌గా ఫ్యాన్లు వినియోగించ‌డం ఉత్త‌మం. 


logo