సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 14:36:35

క‌ర్ర‌సాముతో జీవనం గ‌డుపుతున్న వృద్ధురాలికి హోంమంత్రి ప‌రామ‌ర్శ‌

క‌ర్ర‌సాముతో జీవనం గ‌డుపుతున్న వృద్ధురాలికి హోంమంత్రి ప‌రామ‌ర్శ‌

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని పూణేలో క‌ర్ర‌సాము చేసుకుని జీవ‌నం గ‌డుపుతున్న 85 ఏండ్ల వృద్ధురాలు  శాంతిభాయి ప‌వార్‌ను ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ క‌లిశారు. వ‌య‌‌సు  పైబ‌డిన‌ప్ప‌టికీ ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌ని ఆమెను చూసి  స్ఫూర్తి పొందిన‌‌ట్లు ఆయ‌న చెప్పారు. వృద్ధురాలి క‌ర్రసాము చూసి పుల‌కించిన‌ట్లు తెలిపారు. శాంతిభాయికి ఒక చీర‌‌తోపాటు రూ. ల‌క్ష బ‌హుమ‌తిగా ఇచ్చారు. త‌న బిడ్డ‌లు దూరంగా ఉండ‌టంతో చిన్న‌ప్పుడు నేర్చుకున్న క‌ర్ర‌సాము ద్వారా ఆమె జీవ‌నం సాగిస్తున్న‌ది. క‌రోనా నేప‌థ్యంలో తాను నేర్చుకున్న విద్య‌తోనే వైర‌స్ వ్యాప్తి గురించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ది. ఇటీవ‌ల  శాంతాభాయి గురించి మీడియాలో రావ‌డంతో మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆమెని క‌లిసి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు.
logo