మంగళవారం 07 జూలై 2020
National - Jun 25, 2020 , 13:25:41

కరోనా ఔషధాన్ని అమ్మితే పతంజలిపై చర్యలు తీసుకుంటాం..

కరోనా ఔషధాన్ని అమ్మితే పతంజలిపై చర్యలు తీసుకుంటాం..

ముంబై: కరోనా ఔషధంపై ప్రచారం చేసినా, అమ్మినా పతంజలి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా ఔషధంగా పేర్కొన్న పతంజలి ఆయుర్వేద మందునకు ఆయూష్‌ మంత్రిత్వశాఖ ఇంకా ఆమోదం తెలుపలేదని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ గురువారం చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా ఔషధంగా ప్రచారం చేసినా, అమ్మినా పతంజలి సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 

కాగా, తమ ఔషధం కరోనా వైరస్‌ను నియంత్రిస్తుందని  ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. పతంజలి సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన ఆయన ఈ కరోనా ఆయుర్వేద ఔషధాన్ని ఇటీవల ఆవిష్కరించారు. అయితే ఈ ఔషధానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదని ఆయూష్‌ మంత్రిత్వశాఖతోపాటు ఐసీఎంఆర్‌ స్పష్టం చేశాయి. logo