మంగళవారం 07 జూలై 2020
National - Jun 22, 2020 , 13:29:27

యూనివర్సిటీ సెమిస్టర్‌, చివరి ఏడాది పరీక్షలు రద్దు

యూనివర్సిటీ సెమిస్టర్‌, చివరి ఏడాది పరీక్షలు రద్దు

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా నేపథ్యంలో యూనివర్సిటీ సెమిస్టర్‌, చివరి ఏడాది పరీక్షలను రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అయితే పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు సంబంధిత యూనివర్శిటీ, కాలేజీలకు రాతపూర్వకంగా సమాచారం ఇవ్వాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌ తెలిపారు. మిగతా సెమిస్టర్‌ పరీక్షలను పూర్తి చేసిన వారికే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా పరిస్థితులనుబట్టి చివరి ఏడాది పరీక్షలను స్థానికంగా రాసే అవకాశాన్ని పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. 

అయితే సెమిస్టర్‌ పరీక్షలను పూర్తి చేసిన విద్యార్థులు చివరి ఏడాది పరీక్షలు రాయాలనుకోకపోతే వారి గత మార్కుల ఆధారంగా పాస్‌ చేసి ఆ మేరకు సర్టిఫికెట్లు ఇస్తామని వెల్లడించారు. సాధారణ కోర్సులతోపాటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో యూనివర్సిటీ పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్‌ సమంత్‌ స్పష్టం చేశారు. logo