బుధవారం 20 జనవరి 2021
National - Dec 23, 2020 , 15:15:01

నైట్ క‌ర్ఫ్యూ విధించేందుకు క‌లెక్ట‌ర్ల‌కు అనుమ‌తి

నైట్ క‌ర్ఫ్యూ విధించేందుకు క‌లెక్ట‌ర్ల‌కు అనుమ‌తి

ముంబై: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడిప్పుడే త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. అయితే ఇంత‌లోనే యూకేలో క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త రూపు సంత‌రించుకుని విస్త‌రిస్తుండ‌టం, యూకే నుంచి మ‌న దేశానికి వ‌చ్చిన ప‌లువురికి క‌రోనా పాజిటివ్ రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో దేశంలోని ప‌లు రాష్ట్రాలు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. అందులో భాగంగా క‌ర్ణాట‌క స‌హా కొన్ని రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూ విధించాయి. 

తాజాగా మ‌హారాష్ట్ర  సైతం రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ విధించేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు జిల్లాల్లో క‌లెక్ట‌ర్‌లు వారివారి అధికార ప‌రిధి మేర‌కు నైట్ క‌ర్ఫ్యూ విధించుకునేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించింది. అయితే త‌మ జిల్లాలో నైట్ క‌ర్ఫ్యూ విధించాల‌ని నిర్ణ‌యించుకున్న క‌లెక్ట‌ర్‌లు, ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌డానికి ముందు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనుమ‌తి తీసుకోవాల‌ని మ‌హారాష్ట్ర స‌ర్కారు సూచించింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

నేటి నుంచి క‌ర్ణాట‌క‌లో రాత్రి క‌ర్ఫ్యూ

రాహుల్‌గాంధీకి ఆలుగ‌డ్డ ఎట్ల పెరుగుత‌దో తెలియ‌దు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.        


logo