బుధవారం 08 జూలై 2020
National - Jun 29, 2020 , 16:24:27

మ‌హారాష్ట్ర‌లో జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్

మ‌హారాష్ట్ర‌లో జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్

ముంబై: ‌మ‌హారాష్ట్ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి రోజురోజుకు వేగంగా పెరిగిపోతున్న‌ది. అక్క‌డ క‌రోనా ర‌క్క‌సిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం గ‌త నాలుగు నెల‌లుగా ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జూలై 31 వ‌ర‌కు పొడిగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు మ‌హా స‌ర్కారు సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేసింది. 

అయితే, లాక్‌డౌన్ నియమ నిబంధ‌న‌లు ఎలా ఉండాల‌నే విష‌యంలో స్థానిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి జిల్లాల క‌లెక్ట‌ర్లు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు నిర్ణ‌యం తీసుకుంటార‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్య‌వ‌స‌రాలు, నిత్య‌వ‌సరాల‌కు సంబంధించిన అన్ని ర‌కాల వ్యాపార‌ కార్య‌క‌లాపాలు య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని తెలిపింది. అత్య‌వ‌స‌రంకానీ వాటిలో వేటిని అనుమ‌తించాలి, వేటిని అనుమతించ‌కూడ‌దు అనే విష‌యంలో స్థానిక అధికార యంత్రంగమే నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.    


  


logo