ఆదివారం 17 జనవరి 2021
National - Oct 23, 2020 , 15:30:44

మ‌హారాష్ట్ర‌లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌కు రూ.10 వేల కోట్ల ప్యాకేజీ

మ‌హారాష్ట్ర‌లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌కు రూ.10 వేల కోట్ల ప్యాకేజీ

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల కోసం అక్క‌డి ప్ర‌భుత్వం రూ.10 వేల కోట్ల ప్ర‌త్యేక ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మ‌హారాష్ట్ర స‌ర్కారు ఒక ప్ర‌క‌ట‌న చేసింది. దీపావ‌ళి పండుగ లోగా ఈ ప‌ది వేల కోట్ల న‌గ‌దును బాధితుల‌కు పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ విష‌యాన్ని మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి కార్యాల‌యం (సీఎంవో) కూడా మీడియాకు వెల్ల‌డించింది. కాగా, ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌లో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లు కాల‌నీలు నీటి మునిగాయి. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆస్తిన‌ష్టం వాటిల్లింది. ఈ నేప‌థ్యంలో బాధితుల‌ను ఆదుకునేందుకు మ‌హా స‌ర్కారు ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.