ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 08:33:51

మ‌హారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ క‌న్నుమూత‌

మ‌హారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ క‌న్నుమూత‌

పుణె: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి శివాజీరావ్ పాటిల్ నీలంగేక‌ర్ క‌న్నుమూశారు. గ‌త నెల 16న క‌రోనాతో ఆయన పుణెలోని ఓ ద‌వాఖాన‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో 91 ఏండ్ల‌ పాటిల్‌ ఈ రోజు ఉద‌యం మ‌ర‌ణించార‌ని హాస్పిట‌ల్ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. 

1985 జూన్ నుంచి 1986 మార్చి వ‌రకు శివాజీరావ్ పాటిల్ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఎండీ ప‌రీక్ష‌లో త‌న కుమార్తెకు అక్ర‌మంగా మార్కులు వేయించిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు బాంబే హైకోర్టు తీర్పునివ్వ‌డంతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. మ‌హారాష్ట్రలోని లాతూర్ ఆయ‌న స్వ‌స్థ‌లం.


logo