మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 12:01:11

రెండో రోజు కొన‌సాగిన‌ పాడి రైతుల ఆందోళ‌న‌

రెండో రోజు కొన‌సాగిన‌ పాడి రైతుల ఆందోళ‌న‌

ముంబై : పాల ధ‌ర‌లు పెంచాల‌ని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర పాడి రైతులు రెండో రోజు(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగించారు. పాలపొడి ఎగుమతిని నిషేధించాలని కోరుతూ అదేవిధంగా పాల సేకరణ ధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు సోమవారం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు చేప‌ట్టారు. కిసాన్ సభతో పాటు స్వాభిమాని శెట్‌క‌రి సంఘటనా (ఎస్‌ఎస్‌ఎస్) ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తుంది. ముంబై, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో పాడి రైతుల నిర‌స‌న ప్రభావాన్ని చూపిస్తుంది. 

ప్ర‌భుత్వ పాడి ప‌రిశ్ర‌మ‌ల‌కు ఈ రైతులు పాల‌ను స‌ర‌ఫరా చేస్తున్నారు.  ప్రస్తుతం ఇస్తున్న‌ లీటరు పాలకు రూ .16-17 ను రూ. 30కి పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో పాడి పరిశ్రమలు పాల సేకరణ ధరలను లీటరు పాలకు రూ. 25-30 నుండి తగ్గించాయని రైతులు తెలిపారు. కాగా లాక్‌డౌన్ కార‌ణంగా పాల వినియోగం తగ్గిందని పాడి పరిశ్రమ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌తిరోజు రైతుల నుంచి పాడి ప‌రిశ్ర‌మ‌లు రాష్ర్ట‌వ్యాప్తంగా 1.40 కోట్ల లీట‌ర్ల పాల‌ను సేక‌రిస్తాయ‌ని అంచ‌నా. 10 వేల టన్నుల పాలపొడిని దిగుమతి చేసుకోవాలన్ననిర్ణ‌యాన్ని కేంద్రం ర‌ద్దు చేసుకోవాలని ఆందోళ‌న సంద‌ర్భంగా పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. 


logo