శనివారం 04 జూలై 2020
National - Jun 22, 2020 , 22:06:57

మహారాష్ట్రలో 103 కరోనా పరీక్ష ల్యాబ్‌లు

మహారాష్ట్రలో 103 కరోనా పరీక్ష ల్యాబ్‌లు

ముంబై : కరోనా పరీక్షలు నిర్వహించేందుకు మహారాష్ట్రలో ఇప్పటి వరకు 103 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని, వీటిలో 60 ప్రభుత్వ ఆధీనంలోనివని 43 ప్రైవేట్‌ పరిధిలోవని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మే 26వరకు రాష్ట్రంలో కేవలం 30 ల్యాబ్‌లు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెంచామని స్పష్టం చేసింది. దేశంలో మిలియన్‌లో సగటున 4610మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. మహారాష్ట్రంలో 5847మందికి నిర్వహిస్తున్నామని వెల్లడించింది.  గత మూడు నెలలుగా  7,73,865 శ్యాంపిళ్లను పరీక్షించగా 1,32,075 శ్యాంపిళ్లు కరోనా పాజిటివ్‌ వచ్చాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గత నెలరోజుల్లో పరీక్షల శాతం సగటు రేటును పెంచినట్లు చెప్పారు.logo