శుక్రవారం 05 జూన్ 2020
National - May 09, 2020 , 23:22:07

మహారాష్ట్రలో 20 వేలు దాటిన కరోనా కేసులు

మహారాష్ట్రలో 20 వేలు దాటిన కరోనా కేసులు

ముంబై: దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఈ రోజు కొత్తగా 1165 కేసులు నమోదవగా, 48 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20,228కి, మృతుల సంఖ్య 779కి పెరిగింది. ఈ రోజు నమోదైన కేసుల్లో ఒక్క ముంబైలోనే 772 కొత్త కేసులు ఉండగా, 27 మంది మృతిచెందారు. దీంతో దేశ ఆర్థికరాజధాని అయిన ముంబైలో కరోనా కేసులు సంఖ్య 12864కి చేరింది. గత నెలన్నర రోజుల్లోనే ఈ వైరస్‌ ప్రభావంతో ముంబైలో 489 మంది మరణించారు. 

మహారాష్ట్రలో కేవలం తొమ్మిది రోజుల్లోనే పదివేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 30 నాటికి రాష్ట్రంలో మొత్తం 10 వేల కేసులు ఉండగా, మే 5 నాటికి ఆ సంఖ్య 15 వేలు దాటింది.


logo